లక్ష కేసులు పెట్టినా భయపడను

లక్ష కేసులు పెట్టినా భయపడను

హైదరాబాద్: నా పొలిటికల్ కెరీర్ ను నాశనం చేయాలనే సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌. మంగళవారం రాజాసింగ్ పై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మాట్లాడిన రాజాసింగ్.. తనపై లక్షల్లో కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ధర్మం, దేశం గురించి పోరాడుతూనే ఉంటానన్నారు. ఒక్కో కేసు నమోదు చేసే బదులు.. అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని సీఎం, హోంమంత్రిని కోరుతున్నానన్నారు రాజాసింగ్.

2018లో పరిపూర్ణానంద ర్యాలీలో పాల్గొన్నానని.. ఆ సమయంలో కేసు బుక్ అయ్యిందనీ కోర్టుకు రావాలని ఇప్పుడు నోటీస్ ఇచ్చారన్నారు. నేను కేసీఆర్ ను, హోమ్ మినిస్టర్ ను డీజీపీని అడుగుతున్నా..మొత్తం తెలంగాణలో నాపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని ప్రశ్నించారు. ఇప్పటికే  60 నుంచి 70 కేసులు పెట్టారని..నేనేం భయపడను, కొట్లుడుతా కానీ.. నాపై ఎన్ని కేసులు ఉన్నాయో లెక్క చెప్పండి అన్నారు. FIRలు ఎన్నో చెప్పండన్న రాజాసింగ్.. ఏ ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులు ఉన్నయో చెప్పాలన్నారు.

గో రక్షణపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని.. దేశం జెండా పట్టుకుంటే కేసులు పెడుతున్నారన్నారు. నేను నా దేశం కోసం, దర్మం కోసం పని చేస్తూ చనిపోవలనుకునే వ్యక్తిని అన్నారు రాజాసింగ్. కేసీఆర్ నీకు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నా.. నువ్వు పెట్టే కేసులకు భయపడను… గుర్తు పెట్టుకో అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.