గాంధీ భవన్ ముట్టడికి లంబాడీల యత్నం..అరెస్ట్ చేసిన పోలీసులు 

గాంధీ భవన్ ముట్టడికి లంబాడీల యత్నం..అరెస్ట్ చేసిన పోలీసులు 

హైదరాబాద్, వెలుగు: లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌‌తో గురువారం హైదరాబాద్‌‌లోని గాంధీ భవన్ ముట్టడికి లంబాడీలు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. లంబాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఆదివాసీల బస్సు యాత్రను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వ్యాన్లలో సమీప పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.