పరిగి, వెలుగు: తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి కత్తితో తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేశాడు. పరిగి మున్సిపల్ పరిధిలోని బెస్తకాలనీకి చెందిన వెంకటేశ్గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన భూమిని కొందరు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని ఆరోపించాడు. 20 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, సర్వే చేసి తన భూమి ఇవ్వకపోతే చనిపోతానంటూ తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.
