జ‌మ్మూలో పేలిన భారీ బాంబు.. ద‌ద్దరిల్లిన ఎల్ఓసీ

జ‌మ్మూలో పేలిన భారీ బాంబు.. ద‌ద్దరిల్లిన ఎల్ఓసీ

జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో జులై 29న ఉదయం ల్యాండ్‌మైన్ పేలింది.  దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేగ్వార్ ప్రాంతంలోని టెర్వాన్  ఖోఖ్రీ పోస్ట్ సమీపంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల  తెల్లవారుజామున 4 గంటలకు ల్యాండ్‌మైన్ పేలినట్లు అధికారులు గుర్తించారు.  

ఆర్మీ దళాలు వెంటనే ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. సరిహద్దు దాటి భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడకుండా నిరోధించడానికి   నియంత్రణ రేఖ వెంబడి ల్యాండ్​మైన్లు ఉంచినట్లు అధికారులు చెప్పారు. 

అధిక వర్షాలు, మంటల తీవ్రతకు ఇవి తట్టుకోలేవని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అన్నారు.