- రెండు ప్రాంతాల్లో పాదముద్రలు గుర్తింపు
- అటవీ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలి
- జైపూర్ ఎఫ్ఎస్ఓ రామకృష్ణ సర్కార్
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్మండలంలోని వేలాల ఇసుక క్వారీ వద్ద పెద్ద పులి సంచరిస్తున్న పాదముద్రలను గుర్తించినట్లు జైపూర్ ఎఫ్ఎస్ఓ రామకృష్ణ సర్కార్ మంగళవారం తెలిపారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు.
జైపూర్ కేజీబీవీ స్కూల్ ప్రాంతంలో మరొక పెద్దపులి పాదముద్రలను కూడా గుర్తించామన్నారు. ప్రజలు పులికి హాని తలపెట్టవద్దని, కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పులి కదిలికలపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి రక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు.
