ప్రతి ఒక్కరికీ వాళ్లు చేసే పనిలో గ్రేట్ అనిపించుకోవాలని ఉంటుంది. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి రికార్డ్లకెక్కాలని ఆశపడతారు. అలాంటి ఒక ఆశ, దృఢ సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ మ్యూజిక్ కచేరి. వేల మంది మ్యుజీషియన్లతో, పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాం ఇది.
‘‘వెనిజులా మిలిటరీ యూత్ అకాడమీ” ప్రపంచ రికార్డ్ సాధించాలనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ కచేరిని ఏర్పాటు చేసింది. కచేరీలో భాగంగా పది నిమిషాలు దక్షిణ అమెరికా జాతీయ గీతాన్ని వినిపించారు.
ఇందులో చిన్నపిల్లలు, టీనేజర్స్ వయొలిన్లు, డ్రమ్స్‌తో మ్యాజిక్ చేశారు. నిజానికి ఈ రికార్డ్ స్థాయి కచేరి చేయడానికి దేశ నలుమూలల నుంచి మ్యుజీషియన్స్‌ని రప్పించాలనుకుంది వెనిజులా మ్యూజిక్ నెట్వర్క్ ‘ఎల్ సిస్టెమ’. వాళ్ల లెక్క ప్రకారం పన్నెండు వేల మందిని తీసుకురావాలి. కానీ, అందులో 8వేల 97 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు.
అయితేనేం... వాళ్లు చేసిన సంగీత కచేరితో ప్రపంచాన్నే తమ వైపు తిప్పుకుంది. అంతేకాదు.. ఈ కచేరీ కోసం దాదాపు రెండు నెలలు రిహార్సల్ చేశారు. ఇందుకోసం 250 మంది సూపర్ వైజర్స్ పనిచేశారు. కన్సర్ట్‌లో పాల్లొన్న వాళ్లలో12 ఏళ్ల వయసు నుంచి 77 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఉన్నారు. కచేరి అయిపోయిన వెంటనే మ్యుజీషియన్స్ అందరూ సంతోషంగా తమ ఇనుస్ట్రుమెంట్స్ పైకి ఎత్తి పట్టుకుని, వాళ్ల జాతీయ జెండాలను ఊపారు. ఇంతమంది మ్యుజీషియన్స్ ఒకేసారి మ్యూజిక్ చేయడంతో... ఇది గిన్నిస్ రికార్డ్ నిర్వాహకులను కూడా అట్రాక్ట్ చేసింది. ఈ కచేరి పెర్ఫార్మెన్స్ మీద మరో పది రోజుల్లో రిజల్ట్ చెబుతామన్నారు.
