లోన్ మారటోరియం : కేంద్రం, ఆర్బీఐకి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు

లోన్ మారటోరియం : కేంద్రం, ఆర్బీఐకి  చివరి అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు

కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్ట్ కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.
మార‌టోరియంపై విచార‌ణ ఇదే చివరి అవకాశమని, ఇకపై కేసు విచారణను వాయిదా వేయబోమని తీర్పించింది. కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కరోనా నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు విడతల వారీగా ఆరు నెలల గడువు ఇచ్చింది. అయితే ఈ అవకాశం వినియోగించుకున్న రుణగ్రహీతలపై వడ్డీపై వడ్డీ విధిస్తామని బ్యాంకులు తెలిపాయి. దీంతో కొందరు రుణగ్రహీతలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మారటోరియం కాలంలో చెల్లించని ఈఎంఐలపై వడ్డీ విధించడం తమకు భారంగా మారిందని వాపోయారు.