లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న లాసెట్, పీజీఎల్​సెట్–2022 దరఖాస్తు గడువును ఈ నెల16 దాకా పొడిగించినట్టు లాసెట్ కన్వినర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. సోమవారంతో అప్లై చేసే గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తితో ఈ నెల 16 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తుకు అవకాశమిచ్చినట్టు చెప్పారు. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 24,065 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మూడేండ్ల ఎల్ఎల్​బీ కోర్సు కోసం 16,623 , ఐదేండ్ల ఎల్​ఎల్​బీ కోసం 5,088, ఎల్​ఎల్ఎం కోర్సు 2,354 అప్లికేషన్లు అందాయన్నారు. 

పాలిసెట్ గడువు పెంపు
పాలిసెట్ అప్లికేషన్ల గడువు రూ.100ఫైన్ తో ఈ నెల 8 వరకు పెంచినట్టు పాలిసెట్ కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉంటుందన్నారు. ఇప్పటికే లక్ష అప్లికేషన్లు వచ్చాయి.