
తమిళ నటుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence)కు రజనీకాంత్(Rajinikanth) అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి రజినీకాంత్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడు లారెన్స్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2. సూపర్ హిట్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా లారెన్స్ రజనీకాంత్ ను కలిసి ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఫొటోలతో పాటు ఒక నోట్ కూడా రాసుకొచ్చారు లారెన్స్.. అందరికీ నమస్కారం. ఈ రోజు నా గురువు రజనీకాంత్‌ను కలిసి ఆయనకు జైలర్ సక్సెస్ శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. చంద్రముఖి2 రిలీజవుతున్న సందర్భంగా ఆయన నుంచి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hi friends and fans,
— Raghava Lawrence (@offl_Lawrence) September 26, 2023
Today I met my Thalaivar and Guru @rajinikanth to wish him for jailer’s blockbuster success and got blessings for #Chandramukhi2 release on September 28th. I’m so happy. Thalaivar is always great. Guruve Saranam ???? pic.twitter.com/kXB00aiImw
ఇక చంద్రముఖి2 సినిమా విషయానికి వస్తే.. చంద్రముఖిని డైరెక్ట్ చేసిన దర్శకుడు పీ వాసు నే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.