ఇరాన్‎పై అణు దాడి చేయం: వైట్‎హౌస్ కీలక ప్రకటన

ఇరాన్‎పై అణు దాడి చేయం: వైట్‎హౌస్ కీలక ప్రకటన

వాషింగ్టన్: ‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది”.. ఇది ఇరాన్‎కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. మొత్తం ఇరానే నాశనమైపోతుందని ట్రంప్ పేర్కొనడంతో అసలు ఏం జరగబోతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఎంత చెప్పినప్పటికీ మాట వినకపోవడంతో ఇరాన్‎పై అణు దాడికి అమెరికా సిద్ధమైందని.. ట్రంప్ వ్యాఖ్యల వెనక అర్ధం ఇదేనని సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా దగ్గర ఇంకా బలమైన అస్త్రాలు ఉన్నాయని.. వాటిని ఇప్పటి వరకు ఇరాన్‎పై వాడలేదని.. ఇరాన్ మాట వినకపోతే మాత్రం బహుశా ట్రంప్ వాటిని ఉపయోగించవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వ్యాఖ్యలతో ఇరాన్‎పై అమెరికా న్యూక్లియర్ స్ట్రైక్‎ చేయడం పక్కా అని జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఇరాన్‎పై అణు దాడి వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను వైట్ హౌస్ ఖండించింది. ఇరాన్‎పై అణు దాడి చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల వెనక అర్ధం అదికాదని వివరణ ఇచ్చింది. దీంతో ఇరాన్‎తో పాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే.. ఏం జరుగుతుందో చెప్పేశాడు. ట్రంప్ మాటల్లోనే.. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో తన స్టాంగ్ ఏంటో స్పష్టంగా చెప్పారు ట్రంప్.

 హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు ట్రంప్.