నటి వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

నటి వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

ప్రముఖ బాలీవుడ్‌ నటి వహీదా రెహమాన్‌ (Waheeda Rehman)కు దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం(Dada Saheb Phalke Lifetime Achievement Award) వరించింది. ఈ ఏడాది గాను వహీదా రెహమాన్‌ ఈ పురస్కారానికి ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమలో 5 దశాబ్దాలకు పైగా తన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు వహీదా రెహమాన్‌.

ఇక 1955లో వచ్చిన రోజులు మారాయి అనే తెలుగు చిత్రంతో తెరంగెట్రం చేశారు వహీదా రెహమాన్‌. ఈ చిత్రంలోని ఏరువాక సాగారో రన్నో చిన్నాన్న అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 1956లో సీఐడీ (CID) అనే చిత్రంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా..  ప్యాసా, గైడ్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నారు. తన ఐదు దశాబ్దాల సినీ జీవితం అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు వహీదా రెహమాన్‌. 1971లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న వహీదా.. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.