రశ్మికనే కావాలంటున్న విజయ్.. VD12 నుంచి శ్రీలీల ఔట్..!

రశ్మికనే కావాలంటున్న విజయ్.. VD12 నుంచి శ్రీలీల ఔట్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే VD12 అనే చెప్పాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన రెండు సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. అందులో మళ్ళీరావా(Mallirava) ఒకటి కాగా రెండోవది జెర్సీ(Jersey). నిజానికి ఈ రెండు చాలా సెన్సిబుల్ సినిమాలు. సినిమాలో ఎమోషన్స్ కూడా చాల అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఈ దర్శకుడి సినిమాలను చాలా ఇష్టపడతారు. 

అలాంటి దర్శకుడు తన రూటు మార్చి విజయ్ దేవరకొండతో ఓ గ్యాంగ్ స్టార్ చేస్తే ఎలా ఉంటుంది. అందుకే VD12 పైన అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 

ALSO READ : ఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు

తాజాగా సమాచారం ప్రకారం ఈ పాన్ ఇండియా సినిమా నుండి శ్రీలీల బయటకు వచ్చేసిందట. కారణం శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండటంతో విజయ్ దేవదకొండ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్మెంట్ చేయలేకపోతుందట. అందువల్లే ఈ సినిమా నుండి తప్పుకుందట శ్రీలీల. ఇక ఆమె స్థానంలో మళ్ళీ రశ్మికనే తీసుకున్నారట. ఇప్పటికే విజయ్, రష్మిక గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోనారి కలిసి నటించబోతున్నారు ఈ జంట. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అను అందుకుంటుందో చూడాలి.