స్వప్న కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి: న్యాయవాదుల డిమాండ్

స్వప్న కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి: న్యాయవాదుల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: యువ న్యాయవాది స్వప్న హత్యకు మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో సోమవారం ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు జె. రేణుక యాదవ్, అనంతుల పద్మావతి, గుర్మిత కౌర్, బోయిని గాయత్రి మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం స్వప్న తన సోదరుడు రాజు నుంచి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఆమె మరణానికి పోలీసులు పరోక్షంగా కారకులయ్యారని ఆరోపించారు. సీఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్సై నరసింహారావును సస్పెండ్ చేయాలని డిమాండ్​చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.