ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరవదిక నిరాహార దీక్ష చేపట్టారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. గ్లోబరీనా సంస్థ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. లక్ష్మణ్ నిరహార దీక్షకు పార్టీ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే.. పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టడంతో..వారి కళ్లు గప్పి.. ఓలా క్యాబ్ లో దీక్షా స్థలానికి చేరుకున్నారు.

