కొండపోచమ్మ కట్టకు  బుంగలు

కొండపోచమ్మ కట్టకు  బుంగలు

కట్ట కింది భాగం నుంచి లీకేజీ

సిద్దిపేట, వెలుగు: కొండపోచమ్మ  సాగర్ రిజర్వాయర్ కట్టకు చిన్న బుంగలు  పడి నీరు లీకవుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్​లోని  బీరప్ప ఆలయం దగ్గర మూడు  చోట్ల చిన్న చిన్న  బుంగలు పడ్డాయి. రిజర్వాయర్​ను ప్రారంభించి మూడునెలలైనా కాకముందే రివీట్‌‌‌‌మెంట్‌‌‌‌కింద బుంగలు ఏర్పడటంతో  స్థానికులు ఆందోళన  చెందుతున్నారు.   బుంగలు పడ్డ చోటికి పెద్దసంఖ్యలో జనాలు వస్తుండడంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులను నియమించారు.  ప్రస్తుతం రిజర్వాయర్​లో ఆరు టీఎంసీల నీరుంది. కొత్తగా కట్టిన  ప్రాజెక్టు కట్ట నుంచి నీరు లీకయ్యే అవకాశం ఉన్నా నీళ్లు వరదలా రావడంతో క్వాలిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   రివిట్​మెంట్​ మీద మట్టితో కప్పి  ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించినా లీకేజీ కొనసాగుతోంది.

For More News..

64 శాతం రైతుల దగ్గర.. రెండున్నర ఎకరాల్లోపే..