మెంటార్‌గా ఆనంద్

మెంటార్‌గా ఆనంద్
  • ఆసియా గేమ్స్‌‌‌‌లో పోటీపడే ప్లేయర్లకు గైడెన్స్‌‌ ఇవ్వనున్న విషీ
  • ప్రాబబుల్స్‌‌లో హంపి, హారిక, అర్జున్‌‌, హరికృష్ణ

న్యూఢిల్లీ: ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, ఇండియా చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్.. ఆసియా గేమ్స్ కోసం మెంటార్ అవతారం ఎత్తనున్నాడు. మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడే ఇండియా ప్లేయర్లకు గైడెన్స్‌‌‌‌ ఇవ్వనున్నాడు.  చైనా హంగ్జౌలో సెప్టెంబర్‌‌‌‌10–25 మధ్య  ఆసియా గేమ్స్‌‌‌‌ జరుగుతాయి. పన్నెండేళ్ల లాంగ్‌‌‌‌ గ్యాప్‌‌‌‌ తర్వాత ఈ గేమ్స్‌‌‌‌లో చెస్‌‌‌‌కు మళ్లీ అవకాశం ఇచ్చారు. 2010లో రెండు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలవడం ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో ఇండియా చెస్‌‌‌‌ టీమ్‌‌‌‌కు బెస్ట్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌. అయితే, ఈ సారి నాలుగు గోల్డ్ మెడల్స్ టార్గెట్‌‌‌‌గా ఆలిండియా చెస్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ కాస్త ముందుగానే ప్రిపరేషన్స్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేసింది. ఆనంద్‌‌‌‌ను మెంటార్‌‌‌‌గా ఎంచుకోవడంతో పాటు ఇంటర్నేషనల్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ ఆధారంగా మెన్స్, విమెన్స్‌‌‌‌లో పది మంది ప్లేయర్లతో ప్రాబబుల్స్‌‌‌‌ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మెన్స్‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌మాస్టర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌, ఏపీ ప్లేయర్​ పెంటేల హరికృష్ణ, విమెన్స్ టీమ్‌‌‌‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తదితరులు ఉన్నారు.  పెర్ఫామెన్స్ ఆధారంగా సెలెక్టర్లు ఏప్రిల్ లో ఐదుగురు ప్లేయర్లతో కూడిన ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు.