మెల్బోర్న్ : ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో రెండోసీడ్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 6–3, 3–6, 7–6 (10/7)తో థామస్ మెక్‌హక్ (చెక్)–జాంగ్ జీజెన్ (చైనా)పై గెలిచారు. 2 గంటల 2 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయానికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే మూడో సెట్ సూపర్ టైబ్రేక్‌లో థామస్-–జీజెన్ బేస్‌లైన్ షాట్లతో చెలరేగినా బోపన్న తన ఎక్స్‌పీరియెన్స్‌తో సెట్‌ను గెలిపించాడు. 2013, 2023లో యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి చేరిన బోపన్న టైటిల్‌ను సాధించలేకపోయాడు. శనివారం జరిగే ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్.. బొలెల్లి–వావసోరి (ఇటలీ)తో తలపడతారు. సెమీస్‌లో బోలెల్లి–వావసోరి 6–3, 3–6, 7–6 (10/5)తో హాఫ్మన్–కోఫెర్ (జర్మనీ)పై గెలిచారు.
గాఫ్‌కు సబలెంక చెక్
విమెన్స్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆరీనా సబలెంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో 7–6 (7/2), 6–4తో కోకో గాఫ్ (అమెరికా)ను ఓడించింది. దీంతో యూఎస్ ఓపెన్‌లో గాఫ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక సెరెనా తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టిన తొలి విమెన్ ప్లేయర్‌గా సబలెంక రికార్డులకెక్కింది. గంటా 42 నిమిషాల మ్యాచ్‌లో సబలెంకాకు తొలి సెట్లో పోటీ ఎదురైంది. తొలి సెట్లో వచ్చిన ఆరు బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడంలో ఇద్దరు ప్లేయర్లు ఫెయిలయ్యారు. రెండోసెట్లో సబలెంక సర్వీస్‌లకు గాఫ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. మరో సెమీస్‌లో క్విన్వెన్ జెంగ్ (చైనా) 6–4, 6–4తో డయానా యాస్ట్రేమస్కా (ఉక్రెయిన్)పై నెగ్గి సబలెంకతో టైటిల్ ఫైట్‌కు రెడీ అయ్యింది.