పసిపిల్లల మృతిపై ఆరా: హాస్పిటల్ ను సందర్శించిన లోక్ సభ స్పీకర్

పసిపిల్లల మృతిపై ఆరా: హాస్పిటల్ ను సందర్శించిన లోక్ సభ స్పీకర్

రెండు రోజుల్లో 10 మంది పసిపిల్లలు చనిపోయిన రాజస్థాన్ కోటాలోని జేకే లాన్ ప్రభుత్వ ఆస్పత్రిని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సందర్శించారు. అన్ని బ్లాకులు తిరిగి.. పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డాక్టర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. పసికందుల మృతికి కారణాలు తెలుసుకున్నారు స్పీకర్. నవజాతి శిశువులు ఉండే నియోనాటల్ ఐసీయూలో సరిపడా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్లే  మరణాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెలలో 78 మంది చనిపోగా.. ఈ ఏడాదిలో  940 మంది పిల్లలు చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

జేకే లాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఓం బిర్లా. వైద్య పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఆధునిక  యంత్రాల కోసం అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు. 15 రోజుల్లో ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు స్పీకర్ ఓం బిర్లా.