6 లక్షల సీఎన్‌‌‌‌జీ కార్లు అమ్ముతాం

6 లక్షల సీఎన్‌‌‌‌జీ కార్లు అమ్ముతాం
  •     మారుతి సుజుకీ

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల సీఎన్‌‌‌‌జీ బండ్లను అమ్ముతామని మారుతి సుజుకీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా మూడు లక్షల బండ్లను ఎగుమతి చేస్తామని పేర్కొంది. వేగన్ ఆర్‌‌‌‌‌‌‌‌, బ్రెజ్జా, డిజైర్‌‌‌‌‌‌‌‌, ఎర్టిగా మోడల్స్‌‌‌‌లో సీఎన్‌‌‌‌జీ వేరియంట్లను మారుతి అమ్ముతోంది. హర్యానాలోని మానెసర్ ప్లాంట్ కెపాసిటీని  ఏడాదికి  లక్షల యూనిట్లు పెంచామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ (కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌)  రాహుల్‌‌‌‌ భారతి అన్నారు.  

2‌‌‌‌‌‌‌‌023-–24 లో 4,50,000 సీఎన్‌‌‌‌జీ బండ్లను అమ్మామని పేర్కొన్నారు.  ఎర్టిగాలో  సీఎన్‌‌‌‌జీ వేరియంట్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ ఉందని, సప్లయ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఏడాదికి మూడు లక్షల బండ్లను ఎగుమతి చేయడాన్ని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని చెప్పారు. 2023–24 లో 2,83,000 బండ్లను ఎగుమతి చేశామన్నారు.