ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు.. వెండి పరిస్థితి ఇదే.. కొనొచ్చా..?

ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు.. వెండి పరిస్థితి ఇదే.. కొనొచ్చా..?

ఉగాది వరకూ నెమ్మదిగా తగ్గుతూ కనిపించిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత మళ్లీ ర్యాలీని స్టార్ట్ చేయటం కొనుగోలుదారులకు నిరాశ కలిగిస్తున్నా బెట్ వేసిన ఇన్వెస్టర్లలో మాత్రం సంతోషాన్ని నింపుతోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తమ ప్రాంతాల్లో తాజా రేట్లను గమనించి ముందుకెళ్లటం బెటర్.

మార్చి 20న బంగారం రేట్లు తిరిగి పెరిగాయి. మార్చి 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.65 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 093గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 835గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 20, 2026న దేశవ్యాప్తంగా రూ.10వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు పెద్దగా మార్పు లేకుండా రూ.2లక్షల 65వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.265 వద్ద ఉంది.