ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ ఖాయం

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ ఖాయం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువ బాక్సర్ లవ్లినా బొర్గోహెన్ సత్తా చాటుతోంది. తన కంటే బలమైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్స్ వరకు దూసుకొచ్చిన లవ్లినా.. కీలకమైన క్వార్టర్ ఫైనల్లోనూ దుమ్మురేపింది. చైనీస్ తైపీ బాక్సర్ అయిన చెన్ నైన్ చిన్‌పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో మరో మెడల్ ఖాయమైంది. సెమీస్‌లో ఓడినా లవ్లినాకు పతకం వస్తుంది. కాబట్టి ఆమె ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా బాగా ఆడి ఫైనల్ చేరి.. భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాలని క్రీడా విశ్లేషకులు, ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండేసి బ్రాంజ్ మెడల్స్‌ లవ్లినా ఖాతాలో ఉన్నాయి.