మేఘాలయ పోలీస్‌ బజార్‌‌లో  పేలుడు.. ఖండించిన సీఎం

మేఘాలయ పోలీస్‌ బజార్‌‌లో  పేలుడు.. ఖండించిన సీఎం

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని పోలీస్ బజార్  ఏరియాలో ఆదివారం సాయంత్రం చిన్న పాటి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. అయితే అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ షాపు, వైన్‌ షాపు ముందు భాగం డ్యామేజీ అయింది. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడుతో జరగడంతో ఆ ఏరియాలోని జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో ఎవరూ రాకుండా బారికేడ్లు పెట్టారు. అది ఐఈడీ బాంబు పేలుడు అని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సంఘటనా స్థలానికి  చేరుకున్న బాంబు స్క్వాడ్‌ సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, ఏ రకమైన పేలుడు పదార్థాల కారణంగా ఈ పేలుడు సంభవించిందనేది తేల్చనున్నారని ఈస్ట్ ఖసీ హిల్స్‌ ఎస్పీ సిల్వెస్టర్ నాంగ్‌ట్నగెర్ చెప్పారు.

పేలుడు ఘటనను ఖండించిన సీఎం

షిల్లాంగ్‌లోని పోలీస్ బజార్‌‌లో జరిగిన పేలుడు ఘటనపై తీవ్రంగా ఖండించారు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఈ ఘటనను పిరికిపంద చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో శాంతిని కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కశ్మీర్‌‌ను పాక్, చైనాల్లో చూపిన డబ్ల్యూహెచ్‌వో.. మోడీకి ఎంపీ ఫిర్యాదు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అగ్ని ప్రమాదం

14 ఏళ్లకే సూపర్ 100 విన్నర్‌‌గా నిలిచిన బాలిక ఉన్నతి