హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అగ్ని ప్రమాదం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అగ్ని ప్రమాదం

దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు హనుమకొండ నక్కలగుట్ట బ్రాంచిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి బ్యాంకులో మంటలు వచ్చాయి. దీంతో బ్యాంకు నుంచి బయటకు దట్టంగా పొగలు రావడంతో ఆ పరిసరాల్లోని జనం వెంటనే ఫైర్ సిబ్బందికి  సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పారు.
ఈ ప్రమాదంలో సుమారు 6 నుంచి 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులో సర్వర్​ రూమ్, క్యాష్, లాకర్స్​కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వరంగల్  అసిస్టెంట్​డిస్ట్రిక్ట్​ ఫైర్​ఆఫీసర్ జయపాల్ రెడ్డి తెలిపారు. షార్ట్​ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. కాగా, మంటలు ఆర్పిన అనంతరం బ్యాంకు ఆఫీసర్లతో పాటు సుబేదారి సీఐ రాఘవేందర్​ పరిశీలించారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం ఓడిపోతాడని మేం ముందే చెప్పాం

లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ మినిస్టర్ ప్రకటన

14 ఏళ్లకే సూపర్ 100 విన్నర్‌‌గా నిలిచిన బాలిక ఉన్నతి