పంత్ కెప్టెన్సీలో కోహ్లీ: విజయ్ హాజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న కింగ్

పంత్ కెప్టెన్సీలో కోహ్లీ: విజయ్ హాజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న కింగ్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే కోహ్లీని మళ్లీ గ్రౌండ్‎లో చూడొచ్చు. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో తన హోం టీమ్ ఢిల్లీ తరుఫున కింగ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు విజయ్ హాజారే ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌ల కోసం ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం (డిసెంబర్ 19) జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రన్ మెషిన్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. 

టీమిండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్‎గా వ్యవహరించనున్నాడు. సీనియర్ క్రికెటర్స్ ఇషాంత్ శర్మ , నవదీప్ సైనీ కూడా ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రతి క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచులు ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో సీనియర్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ లీగులో బరిలోకి దిగుతున్నారు. 

కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20, టెస్ట్ ఫార్మాట్‎కు రిటైర్మెంట్ పలికి విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ దిగ్గజాలు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో బరిలోకి దిగిన రోకో జోడి దుమ్మురేపింది. ముఖ్యంగా కోహ్లీ తన వింటేజ్ గేమ్‎ను గుర్తు చేశాడు.

Also Read : 3-1తో సిరీస్ మనదే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా సూపర్ విక్టరీ

వరుస సెంచరీలతో చెలరేగి ఇండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‎గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తమ అభిమాన ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగుతుండటంతో ఏదో రకంగా వారి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

మొదటి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు:

రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, అర్పిత్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, ప్రియాంష్ ఆర్య, తేజస్వి సింగ్ (వికె), నితీష్ రాణా, హృతిక్ షోకీన్, హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రోహన్ మెహ్రా, రోహన్ మెహ్రా, దివిజ్ మెహ్రా, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ, అనుజ్ రావత్ (స్టాండ్‌బై వికెట్ కీపర్)