హైదరాబాద్, వెలుగు: వెల్త్ మేనేజ్మెంట్సేవలు అందించే అమెరికా కంపెనీ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) హైదరాబాద్‌లో ప్రారంభించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వర్చువల్గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యత కారణంగానే ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు సంస్థ తెలిపింది.
దాదాపు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థ, తన అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఇక్కడి నుంచి టెక్నికల్, రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలను అందుకోనుంది. ప్రస్తుతం నానక్‌రామ్‌గూడలోని తాత్కాలిక ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభించగా, 2027 నాటికి శాశ్వత భవనంలోకి మారనుంది.

