V6 News

మరిన్ని జిల్లాల్లో సేవలను అందిస్తాం... ప్రకటించిన ఎల్యూబీ 

మరిన్ని జిల్లాల్లో సేవలను అందిస్తాం... ప్రకటించిన ఎల్యూబీ 

హైదరాబాద్​, వెలుగు:  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ)ను బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణలోని 13 జిల్లాలకు తమ సేవలను విస్తారిస్తామని లఘు ఉద్యోగ్ భారతి (ఎల్​యూబీ) ప్రకటించింది. 

హైదరాబాద్​లో సంస్థ అఖిల భారత అధ్యక్షుడు మధుసూదన్  మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను మార్చేందుకు ఐటీఐలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఐఐసీటీ వద్ద సిద్ధంగా ఉన్న 2,600లకు పైగా టెక్నాలజీలను ఎంఎస్​ఎంఈలకు అనుసంధానం చేయడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.