తెలుగు విశ్వవిద్యాలయంలో అలరించిన ‘మదాలస’ కళాకారిణులు..ఘనంగా తొలి వార్షికోత్సవం

తెలుగు విశ్వవిద్యాలయంలో అలరించిన  ‘మదాలస’ కళాకారిణులు..ఘనంగా తొలి వార్షికోత్సవం

అబిడ్స్, వెలుగు: నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో మదాలస -స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్ సంస్థ తొలి వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. సంస్థ వ్యవస్థాపకురాలు, కళారత్న పురస్కార గ్రహీత సౌజన్య శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆమె శిష్యురాళ్లు నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. 

శిష్టా వైష్ణవి, ఎం.లక్ష్మీప్రసన్న, విష్ణు శ్రియ, వాహిని కృష్ణలు పుష్పాంజలి, అలరిపు, గణపతి స్తుతి, నటేశ్వర కౌత్వం ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భారతీయ సంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నానని సౌజన్య శ్రీనివాస్​తెలిపారు.