నేను మంచి కూతురిని కాను.. చున్ను మిస్ యూ

నేను మంచి కూతురిని కాను.. చున్ను మిస్ యూ

హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న ఎంటెక్ స్టూడెంట్ సూసైడ్ నోట్ రాసి చనిపోయిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మౌనిక చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మౌనికి రాసిన సూసైడ్ నోట్ లో తాను మంచి కూతురిని కానని రాసిందని ఆయన తెలిపారు. తన అక్క కొడుకు చున్ను మిస్ యూ అని రాసినట్లు ఆయన తెలిపారు. మౌనిక ఆత్మహత్యకు సంబంధించి ఆమె రూంమేట్స్ ను విచారణ చేసినట్లు డీసీపీ తెలిపారు. మౌనిక మంచి స్టూడెంట్ అని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆమె రూం నుంచి మౌనిక లాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. సమాచారం మేరకు మౌనిక సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. యూనివర్సిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లు.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు.