హైదరాబాద్: మియాపూర్లోని మయూరి నగర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి చెందింది. అపార్ట్మెంట్ బాల్కనీపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది యువతి.
మృతురాలిని ప్రణవి (20)గా గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రమాదవశాత్తూ జారి పడిందా..? లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
