కాంగ్రెస్ ఊబిలో ఇండియా కూరుకుపోయింది : శివరాజ్ సింగ్ చౌహాన్

కాంగ్రెస్ ఊబిలో ఇండియా కూరుకుపోయింది : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ :  కాంగ్రెస్ ఊబిలో ఇండియా కూటమి కూరుకుపోయిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్​నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్​వాది పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం తలో దారి చూసుకున్నాయని సీఎం చౌహాన్ విమర్శించారు.

కూటమి నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని తెలిపారు. ‘ప్రియాంక జీ.. మిమ్మల్ని నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. ఎస్​పీ, ఆప్ ఇండియా కూటమిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కొట్లాడుకుంటున్నాయి. ఢిల్లీలో ఫ్రెండ్​షిప్, రాష్ట్రాల్లో రెజ్లింగ్ ఆడుతున్నట్లు అనిపిస్తున్నది. దీనిపై మీరు సమాధానం చెప్పాలి’ అని చౌహాన్​ కోరారు. కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితిలో లేవన్నారు. కాంగ్రెస్ కుతంత్రమైన పార్టీ అని అఖిలేశ్ యాదవ్​ చేసిన కామెంట్లను చౌహాన్ గుర్తు చేశారు.