V6 News

మోదీ నియంత పోకడలకు అడ్డుకట్ట...దేశంలో ప్రజాస్వామ్యం గెలిచింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మోదీ నియంత పోకడలకు అడ్డుకట్ట...దేశంలో ప్రజాస్వామ్యం గెలిచింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్​సభలో వీగిపోవడంతో దేశంలో ప్రజాస్వా మ్యం గెలిచిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ నియంత పోకడలకు అడ్డుకట్ట పడిందన్నారు. డీలిమిటేషన్ బిల్లును చట్ట విరుద్ధంగా తెచ్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. 

డీలిమిటేషన్ పేరుతో ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఎంపీ సీట్లు పెంచుకొని రాజకీయ లబ్ధిపొందాలనే బీజేపీ ఎత్తుగడలకు ప్రతి పక్షాలు చెక్ పెట్టాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును బీజేపీ తీసుకొచ్చి మహిళలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా డీలిమిటేషన్ బిల్లు తెచ్చి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందని మహేశ్​ గౌడ్​ మండిపడ్డారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : మంత్రి పొన్నం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడిఉందని, మహిళలకు ప్రాతినిథ్యం వహించేది తమ పార్టీ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు శుక్రవారం  మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగాల్, తమిళనాడు  రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ ఈ బిల్లును హడావుడిగా తెర మీదకు తెచ్చిందని ఆరోపించారు.