V6 News

KPHBలో అమ్మాయిలను వేధిస్తున్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి..

KPHBలో అమ్మాయిలను వేధిస్తున్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి..

హైదరాబాద్ లోని కెపిహెచ్బీలో ఉన్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ తమను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు సంస్థలో  పనిచేసే అమ్మాయిలు. టెలీకాలర్స్ గా పని చేస్తున్న తమను ఎండీ సుబ్బారెడ్డి వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తమను ఆఫీసులో బూతులు తిడుతూ హింసిస్తున్నాడని... ఆఫీసు ముగిసాక రాత్రి సమయంలో కాల్ చేసి వేధిస్తున్నాడని పేర్కొన్నారు బాధితులు.

కర్నూలుకు చెందిన సుబ్బారెడ్డి కేపీహెచ్బీలోని 9th ఫేజ్ లోని రుహిక అపార్ట్మెంట్ లో సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆఫీసు నిర్వహిస్తున్నాడు. తన దగ్గర టెలీకాలర్ గా జాయిన్ అయిన ఏ అమ్మాయిని సుబ్బారెడ్డి వదలడని.. తమను వేధిస్తున్నట్లు ఆడియో రికార్డులు ఉన్నాయని తెలిపారు బాధితులు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎండీ సుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు.