మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి..మాల సంఘాల జేఏసీ డిమాండ్

మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి..మాల సంఘాల జేఏసీ డిమాండ్
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు జేఏసీ కృతజ్ఞతలు

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న మాలలకు ఎస్సీ వర్గీకరణ వల్ల జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో మాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసిం ది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీలో ఈ అన్యాయంపై మాట్లాడినందుకు మంగళవారం హైదర్​గూడలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనకు జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, బేర బాలకిషన్, చెరు కు రామచందర్ కృతజ్ఞతలు తెలిపారు.

 ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యే నాగరాజు అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడం సంతోషకరమన్నారు. వర్గీకరణ వల్ల విద్యా, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని, తమకు మద్దతుగా మాల ఎమ్మెల్యేలు వచ్చి వర్గీకరణ చట్టాన్ని సవరించేదాకా అసెంబ్లీలో నిలదీయాలని కోరారు. 

ఇటీవలి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్ అడ్మిషన్​లో మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు, విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞ ప్తి చేశారు. కార్యక్రమంలో మాదాసు రాహుల్ రావు, కొప్పుల అర్జున్, దాసరి రవి, బత్తుల రమేశ్, దిలీప్, ప్రవీణ్, నర్సింగ్ రావు, మనోజ్ కుమార్  పాల్గొన్నారు.