దళితుల భూ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి: సుధాకర్

దళితుల భూ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి:  సుధాకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన దళితుల అసైన్డ్, ఇనాం, బంచరాయి ఇతర భూములపై అసెంబ్లీలో చర్చ జరపాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నాంపల్లిలోని ఆఫీసులో  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూములను గుంజుకున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, ఆ భూములను తిరిగి దళితులకు అప్పగించాలని కోరారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో వేలాది మందితో చలో హైదరాబాద్  కార్యక్రమం చేపడతామని సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదండాపురం సత్యనారాయణ, జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ అసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసూరి మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి సుధీర్, పలిగిరి కనకరాజు,లక్ష్మణ్ పాల్గొన్నారు.