మేడ్చల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
బోయిన్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గులాబీ కండువా కప్పుకుని కేటీఆర్ జన్మదిన వేడుకలను మల్లారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఊహాగానాలన్నింటినీ కొట్టిపారేశారు.
అయితే ఇటీవల ఒక బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో రాసిన లేఖ తనను ఎంతగానో బాధించిందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. బోయిన్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ బ్యానర్లు, పోస్టర్లు తొలగించడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
