
మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్‌రావు కొడుకు రాహుల్ తేజ్ ఫామ్ హౌస్ లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు తెలుస్తోంది. ములుగులో రాహుల్ తేజ్ కు చెందిన కన్వేరా ఫామ్ హౌజ్ లో డ్రగ్ పార్టీలు జరుపుకున్నట్లు సమాచారం. ప్రతి వారం రాహుల్ తేజ్ ఫామ్ హౌస్ లోనే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య , డ్రగ్ ఫెడ్లర్లు కలుసుకునేవారని తెలుస్తోంది.
మల్నాడు డ్రగ్స్ లో పబ్ యజమానులు హై కోర్టును ఆశ్రయించారు. తమ మీద నమోదైన కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పబ్ లలో ఎలాంటి డ్రగ్స్ పార్టీలు జరగలేదని పిటిషన్ లు తెలిపారు. ఈగల్ టీం మూడు పబ్ యజమానుల పైన ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మల్నాడు రెస్టారెంట్ యాజమాని సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్టు FIR నమోదు చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. మరో వైపు రిమాండ్ లో ఉన్న సీనియర్ పోలీస్ అధికారి కుమారుడు రాహుల్ తేజ్ తో పాటు సూర్య బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న అన్నమనేని సూర్యను ఈ నెల 7న ఈగల్ టీమ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన హర్ష, కరీంనగర్‌కు చెందిన జువ్వాడి సందీప్, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్, రాహుల్ తేజ, పబ్బుల నిర్వాహకులు సహా మొత్తం 25 మందిని ఈగల్ టీమ్ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఇందులో మోహన్, రాహుల్ తేజ పోలీస్ అధికారుల కుమారులుగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే సూర్య కాంటాక్ట్‌లో ఉన్న నైజీరియన్స్, గంజాయి సప్లయర్లు, క్యారియర్ల సమాచారం రాబడుతోంది.