పీకే సహాయం కోరిన దీదీ

పీకే సహాయం కోరిన దీదీ

కోల్ కతా : కరోనా నివారణ లో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న విమర్శలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయం కోరారు మమతా బెనర్జీ. ఢిల్లీ లో ఉన్న ఆయనను వెంటనే కోల్ కతా రావాలని కోరారు. దీంతో ఆయన కార్గో విమాంలో కోల్ కతా కు చేరుకున్నారు. కరోనా ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పీకే సలహాలను దీదీ కోరారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. కరోనా వ్యాప్తిని అరికట్టటంలో బెంగాల్ ప్రభుత్వం పై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. మమతా సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదంటూ ఇక్కడ లాక్ డౌన్ ఎలా అమవుతుందో తెలుసుకునేందుకు సెంట్రల్ టీమ్ ఒకటి కోల్ కతా చేరుకుంది. అటు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా తో పాటు సోషల్ మీడియాలోనూ కరోనా విషయంలో మమతా అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో సిచ్యువేషన్ కరెక్ట్ గా డీల్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోవాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. మమతా సర్కార్ పై మీడియాలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే పనిని ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షించనున్నారు.