అన్నివర్గాల ప్రజలు మోదీ వెంటే ఉన్నారు

అన్నివర్గాల ప్రజలు మోదీ వెంటే ఉన్నారు
  • కొండా విశ్వేశ్వర్​రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

గచ్చిబౌలి, వెలుగు : దేశంలోని అన్నివర్గాల ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ వెంటే ఉన్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి చెప్పారు. బుధవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్​సెంటర్​లో ప్రజ్ఞాభారతి సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సంగీతారెడ్డి పాల్గొని మాట్లాడారు.

దేశంలోని రైతులు, యువకులు, మహిళలు సహా అన్ని వర్గాలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఆయన నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. చర్చా కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రజ్ఞా భారతి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.