ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఆశా వర్కర్స్ పై దాడి

V6 Velugu Posted on May 05, 2021

హైదరాబాద్ : వ్యాక్సిన్ పంపిణీ చేసే ANM, ఆశా వర్కర్స్ పై దాడి జరిగింది.  ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ANM మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరీలపై రాజేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. వ్యాక్సిన్ కోసం వెల్ నెస్ సెంటర్ కి వచ్చిన రాజేష్... స్లాట్ బుకింగ్ లో టెక్నీకల్ ప్రాబ్లమ్ వస్తుందని... తనకు వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలని వాగ్వాదానికి దిగాడంటున్నారు నర్సులు.  వ్యాక్సిన్ నిల్వ లేదని చెప్పదంతో ఆగ్రహంతో తమపై దాడి చేశాడని చెప్తున్నారు. దీనిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు నర్సులు. కేసు నమోదు చేసుకొని రాజేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర తమకు రక్షణ లేదని.. రేపు విధులు బహిష్కరిస్తామంటున్నారు ANMలు. 

Tagged Hyderabad, Nurses, khairatabad, , Wellness Center, Attack Corona

Latest Videos

Subscribe Now

More News