కమల్ హాసన్ కారుపై దాడి..

కమల్ హాసన్ కారుపై దాడి..

మక్కల్ నీధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఆదివారం కమల్ హాసన్ కంచీపురంలో పర్యటించి తిరిగి వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కారును అడ్డుకున్నాడు. దాడిలో కారు అద్దం ధ్వంసమైంది. కమల్ హాసన్ కు ఎటువంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మద్యం మత్తులో ఉన్న నిందితుడిని ఎంఎన్ం కార్యకర్తలు చితక్కొట్టారు. గాయాలవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.