సాయం చేస్తానని ఏటీఎం కార్డు తీసుకొని..రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు...

సాయం చేస్తానని ఏటీఎం కార్డు తీసుకొని..రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు...

వికారాబాద్ లో దారుణం జరిగింది. ఏటీఎం దగ్గర సాయం చేస్తానని నమ్మించి రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు కేటుగాడు. బుధవారం ( మే 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది ఈ ఘటన. గొట్టిముక్కలకు చెందిన రైతు హరినాథ్ డబ్బులు డ్రా చేయడం కోసం పరిగిలోని ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఓ కేటుగాడు హరినాథ్ కు సాయం చేస్తానని నమ్మించి ఏటీఎం కార్డు తీసుకున్నాడు.

హరినాథ్ ఏటీఎం కార్డు తీసుకున్న కేటుగాడు అతని దృష్టి మరల్చి కార్డు మార్చేశాడు. ఆ తర్వాత హరినాథ్ అకౌంట్ నుండి రూ.70 వేలు స్వాహా చేశాడు కేటుగాడు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి చూడగా.. హరినాథ్ అకౌంట్ లో రూ. 170 మాత్రమే ఉండటంతో మోసం వెలుగులోకి వచ్చింది.

మోసగాడిని నమ్మి అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్న హరినాథ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏటీఎం దగ్గర సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వవద్దని.. పిన్ నెంబర్లు చెప్పవద్దని కోరుతున్నారు పోలీసులు.