ప్రియురాలు వార్నింగ్.. నన్ను పెళ్లి చేసుకో లేదంటే నిన్ను రోడ్డుకీడుస్తా

ప్రియురాలు వార్నింగ్.. నన్ను పెళ్లి చేసుకో లేదంటే నిన్ను రోడ్డుకీడుస్తా

8సంవత్సరాలు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి తేవడంతో ప్రియుడు మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు నన్ను పెళ్లి చేసుకో లేదంటే నిన్ను రోడ్డుకీడ్చి నీకు నిద్రపట్టకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రియురాల్ని అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు పక్కాగా ప్లాన్ చేశాడు. అనుకున్న ప్రకారం ప్రియురాల్ని పిలిచి ఆమెను హత్యచేసి..ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.

వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో కానాపూర్ కు చెందిన యువతి హత్యకేసును పోలీసులు చేధించారు.  వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2012 నుంచి శ్వేత, శ్రీనివాసులు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా లాక్ డౌన్ టైమ్ లో తల్లిదండ్రుల ఒత్తిడితో  ప్రియుడు శ్రీనివాస్ తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి విషయం ప్రియురాలు శ్వేతకు తెలియడంతో..ప్రియుడు శ్రీనివాస్ ను నిలదీసింది. అంతేకాదు తాను మోసపోయానని భావించిన శ్వేత.., శ్రీనివాస్ కు తరుచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేది. భార్యకు విడాకులు ఇవ్వాలని బెదిరించేది. దీంతో ఒత్తిడికి గురైన నిందితుడు శ్రీనివాస్.., శ్వేతను హత్య చేయాలని కుట్ర పన్నాడు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల కు బస్సుల్లో వస్తున్న శ్వేతను తన బైక్ ఎక్కించుకొని మహబూబ్ నగర్ నుంచి తండా వైపు వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి వాగ్వాదం జరిగింది. భార్యకు విడాకులు ఇచ్చేయ్. లేదంటే నిన్ను రోడ్డు కీడ్చి నీకు నిద్రపట్టని రాత్రులు చేస్తానంటూ హెచ్చరించింది. దీంతో శ్రీను తన వెంబడి తీసుకువచ్చిన తాడుతో గొంతుకు ఉరి వేసి చపేశాడు. ఆ తర్వాత పత్తి చేనులోకి ఈడ్చు కెళ్లి చనిపోయిందని నిర్దారించుకొన్నాడు. తన బండి లో ఉన్న పెట్రోల్ ను తీసి ఆమె మృతదేహాన్ని కాల్చి వేశాడని  డీఎస్పీ కిరణ్ కుమార్ వెల్లడించారు.