నాగార్జున అంటే ఇష్టం.. మంచి ఆఫర్ వస్తే చూస్తా..

నాగార్జున అంటే ఇష్టం.. మంచి ఆఫర్ వస్తే చూస్తా..

అందం..అభినయం.. ఆత్మ విశ్వాసంలో 28  రాష్ట్రాల అమ్మాయిలతో పోటీ పడింది. విజేతగా నిలిచింది. ‘వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020’ టైటిల్​సొంతం చేసుకుంది హైదరాబాదీ తెలుగమ్మాయి మానస వారణాసి. 23 ఏళ్ల ఈమె.. కాలేజీ డేస్​ నుంచే  సోషల్ ​సర్వీస్ ​యాక్టివిటీస్​లో పాల్గొంది.  పలు ఎన్జీవోలతో కలిసి వర్క్​చేసింది.  ఫ్రీ టైమ్​లో బస్తీల్లోని పిల్లలకు పాఠాలు చెప్పింది. మిస్ ఇండియా వరల్డ్ అయ్యాక తన ముందు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని చెబుతుంది.  ప్రతి ఒక్కరికి చదువు అందాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం  కృషి చేస్తానని చెబుతోంది.  మిస్ ఇండియా వరల్డ్ జర్నీలో టైటిల్ గెలుచుకుని వచ్చాక ఫ్యామిలీతో  సంతోషంగా గడిపే స్తోంది. తన లైఫ్ లోని ఎన్నో మూమెంట్స్ ని ‘వెలుగు’ తో ప్రత్యేకంగా షేర్​చేసుకుంది.

హైదరాబాద్, వెలుగు

వెలుగు :  మోడలింగ్​లోకి ఎలా వెళ్లారు ?

మానస : 2014 లో వాసవి కాలేజీలో బీటెక్​  చది వా. అక్కడ మిస్ ఫ్రెషర్ కాంపిటీషన్ కు నామినేట్ అయ్యా. అలా మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేశా.

వెలుగు: ఫస్ట్ టైం పార్టిసిపేషన్​ ఎలా ఉంది ?

మానస:   ఏం చేయాలో అసలు ఐడియా లేదు.  గ్లామర్ ఇండస్ట్రీ అంతగా టచ్ లేదు. సింపుల్, అకడమిక్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చా.  ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది.

వెలుగు :  విన్నర్​గా  మీ ఫీలింగ్​?

మానస: చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నా.  కొద్ది రోజుల్లో మళ్లీ  ముంబై వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.

వెలుగు : కాంపిటిషన్ ఎక్స్ పీరియన్స్ ?

మానస: ఒత్తిడి కంటే ఎక్కువగా ఎగ్జైట్ గా ఫీలయ్యా. చాన్స్​ రావడం అదృష్టంగా భావించా. ఇప్పుడు ఎన్నో బాధ్యతలు పెరిగాయి. వాటిని పాజిటివ్ ఎనర్జీతో  చేస్తా.

వెలుగు:  టైటిల్ గెలుస్తనని ముందే అనుకున్నరా?

మానస :  మిస్ ఇండియా టైటిల్ విన్ అవడం ఈజీ కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేశా.  ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ గానే తీసుకున్నా.

వెలుగు: న్యూ ప్లేస్, తెలియని వారితో ఉండడం ఎలా అనిపించింది ?

మానస :  మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్. ఈ జర్నీ ఎంతో మంది కొత్తవారిని కలిపింది.  కాంపిటీషన్ లో 70 శాతం వర్చువల్ గానే జరిగింది.  జూమ్, వీడియో కాల్స్ ద్వారా ఇంటరాక్షన్ ఉండేది. 30 శాతం మాత్రమే ముంబైలో డైరెక్ట్ గా కండెక్ట్ చేశారు.

వెలుగు:  కాలేజ్ డేస్​లో సోషల్​ సర్వీస్​ చేశారా?

మానస: సోషల్ సర్వీస్ చేయడం చాలా ఇష్టం. పలు ఎన్జీవోలతో కలిసి వర్క్ చేశా.  ఈక్వాలిటీ ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్, డెఫ్ కమ్యూనిటీ గురించి కూడా చాలా నేర్చుకుంటున్నా. హ్యాండ్లూమ్ వీవర్స్ పై  స్టడీ చేయబోతున్నా. ఇటువంటి ఎన్నో ఇష్యూస్ పై నా వాయిస్, వర్క్ చూపిస్తా.

వెలుగు: ఇష్టమైన పండుగ ?

మానస: బతుకమ్మ ఫెస్టివల్ చాలా ఇష్టం. ఈసారి బతుకమ్మ  ఆడాలనుకుంటున్నా.

వెలుగు:  ఎలాంటి ఫుడ్ ఇష్టం?

మానస :  వెజ్ ఫుడ్ ఎక్కువగా తింటా. ఫేవరెట్ అంటూ స్పెసిఫిక్ గా లేదు.

వెలుగు:  హాబిస్ ?

మానస :  సాంగ్స్ పాడుతా. డ్యాన్సు చేస్తా.  బస్తీల్లో పిల్లలకు టీచ్ ​చేయడమంటే ఇంకా ఇష్టం.  కొత్తగా నేర్చుకునేందుకు ఇంట్రస్ట్​చూపిస్తా.

వెలుగు: మిస్ వరల్డ్ ప్రెజర్ మొదలైందా?

మానస:  ఇప్పుడే మిస్ ఇండియా రిజల్ట్స్ వచ్చాయి కదా. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా.  ప్రెజర్ కి లోనవకుండా నా రెస్పాన్సిబులిటీస్ కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా.

వెలుగు:  హీరోయిన్​గా ఛాన్స్ వస్తే చేస్తారా?

మానస :  ప్రస్తుతం నా ఫోకస్ అంతా మిస్ వరల్డ్ మీదే పెట్టా.  మూవీస్ వరకు  ఇంకా వెళ్లలేదు. ఒకవేళ మంచి ఆఫర్ వస్తే చూస్తా.

వెలుగు: టాలీవుడ్ లో  ఫేవరెట్ హీరో, హీరోయిన్ ?

మానస :  నాగార్జున అంటే చాలా ఇష్టం. హీరోయిన్స్ లో చాలా మంది ఉన్నారు.

వెలుగు:  మిస్ ఇండియా టైటిల్​ జర్నీలో మెమోరబుల్​ మూవ్​మెంట్​?

మానస :  ఒక్కటంటూ చెప్పలేను. మోస్ట్ మెమోరబుల్ మూవ్​మెంట్​మా అమ్మమ్మతో టైం స్పెండ్ చేయడం. ఆమె పక్కన కూర్చోవడం, స్టోరీస్ షేర్ చేసుకోవడం. అన్నీ తనతో షేర్ చేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.

వెలుగు:  ఆన్సర్ పై  మీ ఎక్స్ పీరియన్స్ ?

మానస: స్పిరిచ్యువాలిటీ, రిలీజియన్​కు మధ్య తేడా ఏంటి? మిమ్మల్ని మీరు ఒక స్పిరిచ్యువల్ పర్సన్ గా కన్సడర్ చేస్తరా? లేక రిలీజియస్​పర్సన్ గా కన్సడర్ చేస్తరా? అని అడిగారు.  ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈనెల 28న కలర్స్ హెచ్ డీ చానల్​ చూడాలి.