75 శాతం ఓటర్లు బీజేపీకే ఓటేస్తరు

75 శాతం ఓటర్లు బీజేపీకే ఓటేస్తరు
  • 38 నియోజకవర్గాల్లో మణిపూర్ తొలి దశ ఓటింగ్

మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్  జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్  సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్  అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. మొదటి విడుతలో.. ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 38 సెగ్మెంట్లలో 173 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో మహిళలు 15 మంది ఉన్నారు. మొదటివిడత కోసం 17వందల 21 పోలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. సీఎం బీరెన్ సింగ్, స్పీకర్ ఖేమ్ చంద్, డిప్యూటీ సీఎం యుమ్ నామ్ జోయ్ కుమార్ సింగ్, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ లోకేష్ సింగ్ మొదటి విడత బరిలో ఉన్నారు. 

75 శాతం ఓటర్లు బీజేపీకే ఓటేస్తరు

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఉదయాన్నే తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి.. దేవుడికి మొక్కిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా విలువైన తమ ఓటును వేయాలని కోరారు. తన నియోజకవర్గంలో 75 శాతం ఓటర్లు బీజేపీకే ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని భావిస్తున్నానన్నారు. తొలి దశ పోలింగ్ జరుగుతున్న 38 సీట్లలో 30 తామే గెలుస్తామని బీరెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 

మణిపూర్ గవర్నర్ లా గణేశన్ ఇంఫాల్ లోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపూర్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారాయన. అలాగే మణిపూర్ డిప్యూటీ సీఎం, ఎన్పీపీ నేత యుమ్నామ్ జోయ్ కుమార్ సింగ్ ఇంఫాల్ లోని నావ్రెంథోంగ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు వేశారు.

మణిపూర్ లో మొదటివిడత ఎన్నికల పోలింగ్  నిన్ననే జరగాల్సి ఉన్నది. కానీ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో ఇవాళ్టికి వాయిదావేశారు. మార్చి 5న మరో 22 స్థానాలకు రెండో విడుత పోలింగ్  జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు 28 సీట్లను సొంతం చేసుకుని కాంగ్రెస్  అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ 21 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ అధికారం చేపట్టింది. నేషనల్  పీపుల్స్  పార్టీ, నాగా పీపుల్స్  ఫ్రంట్ , స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం బీజేపీ, ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్  విడివిడిగా పోటీచేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...

ఇండియాకు తరలింపు.. ఒక్కో ఫ్లైట్​కు  గంట ఖర్చు 8 లక్షలు

మూసీ నీటిని దోసిళ్లతో తాగేలా చేస్తాం