
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి ఇండియన్లను తీసుకొస్తున్న విమానాల ఖర్చు గంటకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా అవుతోందని ఎయిరిండియా అధికారి చెప్పారు. విమాన సిబ్బంది, ల్యాండింగ్, పార్కింగ్ ఖర్చులు, ఇంధనం, నావిగేషన్ వంటివన్నీ కలుపుకుని టైంను బట్టి ఒక్క విమానం పోయిరావడానికి రూ.కోటీ పదిలక్షలకుపైగా ఖర్చు అవుతుందని తెలిపారు. ఒక్కో విమానంలో రెండు గ్రూపుల సిబ్బంది డ్యూటీ చేస్తున్నారని చెప్పారు.