మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటున్న ‘ఘటం’ పర్ఫామెన్స్

మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటున్న ‘ఘటం’ పర్ఫామెన్స్

న్యూఢిల్లీ: హై టెక్ వరల్డ్‌‌లో చాలా మంది జీవితం ఉరుకులు పరుగులుగా సాగుతోంది. ఇలాంటి టైమ్‌‌లో ప్రశాంతత కోసం కొందరు వ్యాయామం చేస్తుంటారు. మరికొందరు ఆటలు ఆడుతుంటారు, పుస్తకాలు చదువుతుంటారు. ఇలా తమకు నచ్చిన హాబీతో మనస్సును తేలికపర్చుకోవడానికి యత్నిస్తుంటారు. అయితే ఎక్కువ మందికి ఉండే అలవాటు మాత్రం మ్యూజిక్ వినడం. సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. అది అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. సంగీతంతో మనసుకు సాంత్వన చేకూరుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. మనం ఎప్పుడూ వినని కొన్ని వాయిద్య పరికరాలపై వినే కొత్త మ్యూజిక్ వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబేయేది అలాంటి వాయిద్యం గురించే. ఘటం గురించి వినే ఉంటారు. కుండను లయబద్ధంగా వాయించడమే ఘటం. వీడియోలోని ప్రముఖ ఘటం కళాకారుడు గిరిధర్ ఉడుపా ఘటం వాయించడాన్ని వింటే ఆ శబ్దంతో పులకరించిపోవడం ఖాయం. ఈ వీడియోకు ఇప్పటికే 17.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సంగీత ప్రియులారా ఆలస్యమెందుకు ఈ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.