మార్కులే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు

మార్కులే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు

సరిగ్గా చదవట్లేదని, ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువ వస్తున్నాయని చాలామంది తల్లిదండ్రులు  పిల్లల్ని తిడుతుంటారు. ఇక టెన్త్​ క్లాస్, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయనుకోండి...  మరింత కష్టపడాలని పిల్లల్ని ఒత్తిడి చేస్తుంటారు.  ‘ఇప్పుడు చదివితేనే ఫ్యూచర్ బాగుంటుంద’ని పదే పదే అంటుంటారు. కానీ, ‘అలా ఏం కాదు. ఈ రోజు సరిగ్గా చదవనివాళ్లు, చదువు విలువ తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వాళ్లు కచ్చితంగా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతారు. వాళ్లపైన నమ్మకం ఉంచాలి. మామూలుగా చదివే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఏదో ఒక టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ముందు అదేంటో గుర్తించాలి’ అంటున్నాడు ఐఎఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవనీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

చిన్నప్పుడు బాగా చదవని వాళ్లలో కొందరు పెద్దయ్యాక మంచి ఉద్యోగం సాధించడం చూస్తుంటాం. అలాంటి వాళ్లలో ఒకడైన తుషార్​ సమేరా గురించి చెప్పి, స్టూడెంట్స్​లో స్ఫూర్తి నింపాలనుకున్నాడు అవనీష్​.  అందుకోసం తుషార్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్త్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమోను తన ట్విట్టర్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టాడు అవనీష్​.  తుషార్​ ఇప్పుడు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని, భరూచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

పట్టుదలతో ఏదైనా సాధ్యమే

ఈమధ్యే చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​లోని బలరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెన్త్​  క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్ రాసిన  స్టూడెంట్స్​తో మాట్లాడాడు అవనీష్​. ‘‘చదువులో యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిలో యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పట్టుదల ఉంటే ఐఎఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐపిఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అవ్వొచ్చు. తక్కువ మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు కాదు. ఇప్పుడొచ్చిన మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేవు. టెన్త్​ క్లాస్​లో వంద మార్కులకు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 35, మ్యాథ్స్​లో 36, సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 38 మార్కులతో పాస్ అయిన తుషార్ సుమేరా, ఇప్పుడు ఐఎఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అలానే అందరికీ ఏదో ఒకరోజు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతారు. అంతేకానీ, ఇప్పుడు వచ్చిన మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి అధైర్యపడొద్దు’ అని చెప్పాడు అవనీష్​. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసిన వాళ్లంతా ‘డోంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై ఇట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.