Good Health:  డయాబెటిస్ ఉన్నవారు.. ఏమి తినాలి.. ఏమి తినకూడదు.. 

Good Health:  డయాబెటిస్ ఉన్నవారు.. ఏమి తినాలి.. ఏమి తినకూడదు.. 

మధుమేహం.. డయాబెటిస్​.. షుగర్​ వ్యాధి  ఈ మూడు ఒకటే.. ఇది వచ్చిందా అస్సలు తగ్గదు.. కాని కచ్చితంగా కంట్రోల్​ గా ఉంచుకోవాల్సిందే.. రక్తంలో గ్లూకోజ్​ స్థాయి ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి.ఈ వ్యాధి గతంలో 40 ఏళ్లు దాటితే వచ్చేది. కాని ప్రస్తుతం  ఇరవై ఏళ్లకే షుగర్​ వ్యాధితో బాధ పడుతున్నవారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది.  అంటే మనం తినే ఆహారంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే.. మధు మేహం ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

డయాబెటిస్​  శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం, గుండె అన్ని సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహ వ్యాధి ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి విషయంలో భారతదేశం నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది

డయాబెటిస్ ఉన్నవారు  తినకూడనవి

  • బంగాళాదుంప
  • స్వీట్స్
  • చాక్లెట్స్
  • కేకులు
  • బిస్కెట్లు
  • కూల్ డ్రింక్స్
  • ఐస్​ క్రీమ్
  • ఫాస్ట్ ఫుడ్
  • జంక్​ ఫుడ్​ 
  • తెల్ల బియ్యం
  • డీప్ ఫ్రై పదార్ధాలు
  • అధిక నూనెతో తయారు చేసిన వంటలు
  • షుగర్ కలిపిన  జ్యూసులు
  • చిలగడదుంపలు ( స్వీట్​ పొటాటో)
  • బ్రెడ్
  •  మైదాతో చేసిన పదార్ధాలు

కచ్చితంగా తినాల్సినవి 

 

  • క్యాబేజీ
  • దొండకాయ
  • కాకరకాయ
  • బెండకాయ
  • పాలకూర
  • బచ్చలి కూర
  • క్యాబేజీ
  • కాలీఫ్లవర్
  • కీరదోసకాయ
  • టమోటా
  • జామ 
  • ఆపిల్ (మితంగా)
  • రాగి రొట్టె
  • జొన్న రొట్టె
  • పప్పులు
  • శనగలు
  • బీరకాయ
  •  ఉసిరి కాయతో చేసిన పదార్ధాలు
  •  నిమ్మకాయ లేదా నిమ్మరసం ( పంచదార లేకుండా)
  •  నారింజ పండు
  •  బొప్పాయి
  •  క్యారెట్
  •  బ్రకోలీ
  •  ముల్లంగి
  • గుమ్మడికాయ
  •  క్యాప్సికం
  •  మెంతికూర
  •  ముల్లంగి 
  • చేదు పొట్లకాయ
  •  పచ్చి అరటి వంటి 
  •  వంటలో  ఆవాల నూనె లేదా పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించాలి

ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి.  ఒత్తిడిని నివారించడానికి ప్రాణాయామం, ధ్యానంతో పాటు రోజుకు  కనీసం అరగంట పాటు నడవాలి.