‘చాత్రోంకీ గూంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాలి: శివ చరణ్రెడ్డి

‘చాత్రోంకీ గూంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాలి: శివ చరణ్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: చాత్రోంకీ గూంజ్ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకొని, అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చాత్రోంకీ గూంజ్ కార్యక్రమాన్ని పార్టీ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని గుర్తు చేశారు. 

ఇటీవల రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కోటాలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొని, నీట్ పరీక్షల్లో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై గళమెత్తారని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలకు వివరించారు.  ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అండగా నిలవాలని ఆదేశించారు.