ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ నిధికి 1.5 శాతం బేసిక్ పే కట్‌‌‌‌‌‌‌‌

ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ నిధికి 1.5 శాతం బేసిక్ పే కట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్​లెస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ నిధికి సంబంధించి ఉద్యోగుల బేసిక్ పే, పింఛనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం చొప్పున కోత విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.

2026 మే నెలకు సంబంధించిన జీతాలు, పింఛన్ల (జూన్ నెలలో చెల్లించేవి) నుంచే ఈ మినహాయింపులు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 16వ తేదీ నుంచి ఈహెచ్​ఎస్​ అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

డబుల్ కటింగ్ ఉండదు

భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగిగా ఉండి మరొకరు పింఛన్ పొందుతున్నా, అలాగే ఒకరే సర్వీస్, ఫ్యామిలీ పింఛన్లు రెండూ తీసుకుంటున్నా.. వారిలో ఒకరి నుంచి మాత్రమే ఈ 1.5 శాతం ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ చందాను మినహాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను డీడీవోలు నిశితంగా పరిశీలించి ఐఎఫ్ఎంఐఎస్- వ్యవస్థలో నమోదు చేయాలని చెప్పింది., పొరపాటున ఎవరికైనా రెండుసార్లు కట్‌‌‌‌‌‌‌‌ అయి ఉంటే ఆ అదనపు మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేయాలని జీవోలో పేర్కొన్నారు.